మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో మరో వివాదం

Mon,September 3, 2018 01:43 PM
Shivaji Raja responds on rumours of MAA Movie Association

హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో మరో వివాదం తెరపైకి వచ్చింది. సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మా నిధులు దుర్వినియోగం చేశారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. నిధుల దుర్వినియోగం ఆరోపణలపై మా అధ్యక్షుడు శివాజీ రాజా స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో శివాజీ రాజా మాట్లాడారు. మీడియా సమావేశంలో మా కోశాధికారి పరుచూరి వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు శ్రీకాంత్ పాల్గొన్నారు.

అసోసియేషన్‌లో 5 పైసలు దుర్వినియోగమైనా నా ఆస్తంతా రాసిచ్చేస్తా. వేడుకల ద్వారా వచ్చే డబ్బులతో మా అసోసియేషన్ భవనం నిర్మించాలన్నదే లక్ష్యం. అసోసియేషన్ ఎన్నికలు సమీపిస్తున్నందున మాపై ఆరోపణలు. - శివాజీ రాజా

సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఒప్పందం ప్రకారమే డబ్బు వసూలైంది. - పరుచూరి వెంకటేశ్వరరావు

నిధుల దుర్వినియోగంపై నిరూపిస్తే శాశ్వతంగా అసోసియేషన్ నుంచి తప్పుకుంటా. -శ్రీకాంత్

3876
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles