రాజ్ కందుకూరి త‌న‌యుడు శివ హీరోగా రూపొందుతోన్న చిత్రం `చూసీ చూడంగానే`

Sun,August 4, 2019 11:23 AM

తెలుగు సినీ చరిత్రలోనే మూస ధోరణి పక్కన బెట్టి.. సింపుల్‌ అండ్‌ సూపర్బ్‌గా తెరకెక్కిన మూవీ పెళ్లి చూపులు. విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ఆ సినిమా సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. అంతేకాదు.. ఆ సినిమా విజయ్‌ దేవరకొండకు మంచి సినీ కెరీర్‌ను ఇచ్చింది. `పెళ్ళిచూపులు`, `మెంట‌ల్ మ‌దిలో` వంటి చిత్రాల‌ను నిర్మించి స‌క్సెస్‌ఫుల్ నిర్మాత‌గా పేరు తెచ్చుకోవ‌డ‌మే కాదు.. జాతీయ అవార్డ్‌, ఫిలింఫేర్ అవార్డుల‌ను సైతం చేసుకున్నారు నిర్మాత రాజ్ కందుకూరి.

ఆ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన రాజ్‌ కందుకూరి కొడుకు శివ కందుకూరి ఇప్పుడు హీరోగా తెరంగేట్రం చేయబోతున్నారు. రాజ్ కందుకూరి నిర్మాత‌గా, ఆయ‌న త‌న‌యుడు శివ కందుకూరి హీరోగా న‌టిస్తోన్న తొలి చిత్రానికి `చూసీ చూడంగానే` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ చిత్రం ద్వారా శేష సింధు రావు అనే మ‌హిళా ద‌ర్శ‌కురాలిని ప‌రిచ‌యం చేస్తున్నారు రాజ్ కందుకూరి. ఈమె క్రిష్ జాగర్ల‌మూడి, సుకుమార్‌ల వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేశారు.


ఈ చిత్రం షూటింగ్ పూర్త‌య్యింది. నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి చిత్రాన్ని సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. రాజ్ కందుకూరి గ‌త చిత్రాల మాదిరిగానే సినిమా కూడా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ అసోసియేష‌న్‌లో విడుద‌ల‌వుతుంది. రొమాంటిక్ కామెడీ జోన‌ర్‌లో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో వ‌ర్ష బొల్ల‌మ్మ హీరోయిన్‌గా నటించింది. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన `96` చిత్రంలో వ‌ర్ష హీరోయిన్‌గా నటించారు. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి `మెంట‌ల్ మ‌దిలో` కెమెరా మెన్ వేద రామ‌న్ సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు శివ కందుకూరి మ‌రో మూడు చిత్రాల్లో హీరోగా న‌టిస్తున్నారు.

1316
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles