బిగ్‌బాస్ కిరీటాన్ని దక్కించుకున్న శివబాలాజీ

Sun,September 24, 2017 10:44 PM
బిగ్‌బాస్ కిరీటాన్ని దక్కించుకున్న శివబాలాజీ

బిగ్‌బాస్.. హిందీలో ఈ రియాలిటీ షో ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలుసు. తర్వాత తమిళం, కన్నడంలలోనూ అలరించింది. ఆ తర్వాత తెలుగులోనూ ఎన్టీఆర్ హోస్ట్‌గా మనముందుకు వచ్చింది. ఇక.. 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమయిన బిగ్‌బాస్ తెలుగు షోలో కొన్ని రోజుల తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా నవదీప్, దీక్ష బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంటరయ్యారు. ఇక.. ప్రతి వారం.. ఒక్కొక్కరిగా ఎలిమినేట్ అవుతూ వస్తూ చివరకు ఐదుగురు కంటెస్టెంట్లు శివబాలాజీ, హరితేజ, నవదీప్, అర్చన, ఆదర్శ్ ఫైనలిస్టుగా మిగిలారు. ఉన్న ఐదుగురిలోనూ ఒక్కొక్కరూ ఎలిమినేట్ అవుతూ.. చివరకు ఇద్దరు ఫైనలిస్టులుగా శివబాలాజీ, ఆదర్శ్ మిగిలారు. అనంత‌రం.. బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ విజేతగా శివబాలాజీ నిలిచాడు. ప్రేక్షకులు శివబాలాజీకి ఎక్కువ ఓట్లు వేసి గెలిపించడంతో బిగ్ బాస్ సీజన్ 1 విజేతగా ఆయన నిలిచాడు. మొత్తం ప్రైజ్ మనీ 50 లక్షల రూపాయలను, బిగ్‌బాస్ ట్రోఫీని శివబాలాజీకి హోస్ట్ ఎన్టీఆర్ అందజేశారు.

4428

More News

VIRAL NEWS