థియేటర్ లో 'థాకరే' పోస్టర్లు లేవని శివసేన ఆందోళన

Fri,January 25, 2019 05:24 PM
Shiv Sena workers protest premises of a film theatre in Mumbai

ముంబై: శివసేన చీఫ్ బాల్ థాకరే బయోపిక్ 'థాకరే' నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ముంబైలోని ఓ థియేటర్ లో థాకరే సినిమా పోస్టర్ లేకపోవడంతో వివాదం నెలకొంది. వశీలోని థియేటర్ లో థాకరే సినిమా పోస్టర్లు డిస్ ప్లే చేయడం లేదని శివసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సినిమా థియేటర్లలో బైఠాయించి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొంతమంది కార్యకర్తలు థియేటర్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. థియేటర్ లో థాకరే సినిమా పోస్టర్లు కనిపించేలా చూడాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. థాకరే చిత్రంలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ లీడ్ రోల్ పోషించారు.

1499
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles