శిల్పా శెట్టి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్

Thu,November 23, 2017 03:02 PM
Shilpa Shetty Wish Raj Kundra behalf of anniversary

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి , ప్రముఖ బిజినెస్ మెన్ రాజ్ కుంద్రా నవంబర్ 22,2009న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నిన్న వీరి వెడ్డింగ్ యానివర్సరీ కాగా దంపతులు ఇద్దరు తమ ప్రేమని సోషల్ మీడియా ద్వారా ఎక్స్ ప్రెస్ చేసుకున్నారు. 8 ఏళ్ల వివాహ బంధంలో వీరికి వియాన్ అనే కుమారుడు జన్మించాడు. శిల్పా తన ఇన్ స్ట్రాగ్రామ్ లో మ్యారేజ్ ఫోటో ఒకటి షేర్ చేస్తూ భర్తపై తనకెంత ప్రేమ ఉందో స్వీట్ మెసేజ్ ద్వారా తెలిపింది. ఇక రాజ్ కుంద్రా .. శిల్పాతో కలిసి ప్రయాణించిన 8 ఏళ్ళలో ఉన్న స్వీట్ మొమోరీస్ అన్నింటిని కొలేగ్ లా తయారు చేసి తన ప్రేమను వ్యక్త పరచాడు. బుధవారం సాయంత్రం ఈ జంట వారి ఫేవరేట్ రెస్టారెంట్ వాసాబి కి వెళ్లి అక్కడ కేక్ కట్ చేసి తమ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ విషయాన్ని శిల్పా తన సోషల్ మీడియా పేజ్ ద్వారా తెలిపింది.

1315
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS