హిందీ ద‌ర్శ‌కులపై సంచ‌ల‌న కామెంట్స్ చేసిన శేఖ‌ర్ క‌పూర్

Sat,December 15, 2018 12:45 PM
Shekhar Kapur sensational comments on hindi directors

భారీ బ‌డ్జెట్ చిత్రాలు తెర‌కెక్కించ‌డంలో ద‌క్షిణాది ద‌ర్శ‌కులు విజ‌య‌వంతం అవుతున్నారు. మ‌రి ఎక్క‌డ ముంబై ద‌ర్శ‌కులు విఫ‌ల‌మవుతున్నారు. ద‌క్షిణాది ద‌ర్శ‌కుల‌కి సినిమాలు చేయ‌డమంటే చాలా పాష‌న్‌. అందుకే వారు బాహుబ‌లి, బాహుబ‌లి 2, 2.0 వంటి భారీ బ‌డ్జెట్ చిత్రాలు తెర‌కెక్కించి విజ‌యం సాధించారు అని అంటున్నారు ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌పూర్‌. సౌత్‌లో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన బాహుబ‌లి, బాహుబ‌లి 2, 2.0 చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్ళు సాధించిన సంగ‌తి తెలిసిందే. రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి సిరీస్ ప్ర‌భంజ‌నం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇక రీసెంట్‌గా విడుద‌లైన 2.0 చిత్రం రెండు వారాల్లో 700 కోట్లు వ‌సూలు చేసింది. జ‌పాన్‌లో ఈ చిత్రం భారీ స్క్రీన్స్‌లో విడుద‌ల కానుండ‌గా, అక్క‌డ కూడా ఈ చిత్రం క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించ‌నుంద‌ని అంటున్నారు. అయితే హిందీలో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టిన నేప‌థ్యంలో శేఖర్ క‌పూర్ ఈ కామెంట్స్ చేసి ఉంటాడ‌ని అభిమానులు భావిస్తున్నారు.1878
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles