ధృవ్ తో శేఖర్‌కమ్ముల సినిమా..?

Tue,July 17, 2018 10:13 PM
shekhar kammula movie with vikram son Dhruv


కోలీవుడ్ నటుడు విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా అర్జున్ రెడ్డి రీమేక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వర్మ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రానికి బాల దర్శకుడు. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే ధృవ్ టాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడని టాక్ వినిపిస్తోంది.

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ధృవ్ సినిమా చేయనున్నాడన్న వార్త ప్రస్తుతం ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది. ఫిదా సినిమా ఘనవిజయం సాధించిన తర్వాత శేఖర్ కమ్ముల మరో చిత్రాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మరి శేఖర్‌కమ్ముల తన కొత్త చిత్రాన్ని ధృవ్ తోనే తీస్తాడా లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

1666
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS

Namasthe Telangana Property Show

Featured Articles