ఆఫీస‌ర్ వీడియో సాంగ్ విడుద‌ల‌

Tue,May 29, 2018 01:27 PM
Shehanai Baje Video Song from officer

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, కింగ్ నాగార్జున కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం ఆఫీసర్. మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్‌గా రూపొందిన ఈ చిత్రంతో వ‌ర్మ కొత్త సౌండ్‌ని ప‌రిచ‌యం చేయ‌నున్నాడ‌ట‌. నిన్న చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జ‌రుగ‌గా, ఈ కార్యక్ర‌మంలో వ‌ర్మ‌, నాగ్‌లు చిత్రానికి సంబంధించిన విశేషాలు పంచుకున్నారు. మూవీ మంచి విజ‌యం సాధిస్తుంద‌నే ఆశాభావం వ్య‌క్తం చేశారు. జూన్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న ఈ చిత్ర వీడియో సాంగ్‌ని తాజాగా విడుద‌ల చేశాడు వ‌ర్మ‌. సిరాశ్రీ రాసిన ఈ పాట‌కి ర‌విశంక‌ర్ సంగీతం అందించారు.

ఆఫీస‌ర్ చిత్రం కిడ్నాప్ అయిన పాప‌ని ర‌క్షించే నేప‌థ్యంలో రియ‌ల్ పోలీస్ ఆఫీస‌ర్ జీవితమాధారంగా తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తుంది. మైరా సరీన్ అనే కొత్త అమ్మాయి ఈ చిత్రంలో కథానాయికగా నటించింది . బేజీ కావ్యా, ఫిరోజ్‌ అబ్బాసీ, షాయాజీ షిండే, అజయ్‌ తదితరులు కీలక పాత్ర పోషించారు. కంపెనీ బేనర్ పై వర్మ ఈ చిత్రాన్ని నిర్మించాడు. రామ్ గోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన శివ, గోవిందా గోవిందా, అంతం చిత్రాలు భారీ విజయం సాధించడంతో ఆఫీసర్ చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

2344
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles