కొత్త బంగారు లోకం వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించి అందరి దృష్టిలో పడ్డ శ్రీకాంత్ అడ్డాల ఆ తర్వాత మహేష్, వెంకీ కాంబినేషన్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే చిత్రాన్ని చేశాడు. ఇక 2016లో మహేశ్‌బాబుతో బ్రహ్మోత్సవం అనే చిత్రం చేశాడు. ఈ సినిమాకి ఆయనకి ఘోర పరాభవం కలిగించింది .దీంతో ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్టును ఓకే చేయలేదు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు కొత్త సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు శ్రీకాంత్. తాను రెడీ చేసుకున్న కొత్త స్క్రిప్ట్‌ను శ్రీకాంత్ అడ్డాల ఇటీవలే శర్వానంద్‌కు వినిపించగా..దీనికి శర్వానంద్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. తన ప్రతి సినిమాకి వినూత్నంగా టైటిల్స్ ఉండేలా చూసుకునే శ్రీకాంత్ అడ్డాల తదుపరి సినిమాకి కూడా కాస్త కొత్తగా టైటిల్ ఉండేలా చూసుకుంటున్నాడట. కూచిపూడి వారి వీధి’ అనే టైటిల్ తో ఈ సినిమాని తెరకెక్కించాలని వారు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కించనున్నారట. అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. చిత్రంలో మరో యాక్టర్‌గా దర్శకుడు ఎవరిని ఎంచుకుంటారో ప్రస్తుతానికి సస్పెన్స్ .