స‌రికొత్త లుక్‌తో ఆకట్టుకుంటున్న శ‌ర్వానంద్

Thu,February 21, 2019 08:02 AM
Sharwanand NEW look goes viral

టాలీవుడ్ యంగ్ హీరోల‌లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న న‌టుడు శ‌ర్వానంద్. కెరీర్‌లో విభిన్న పాత్ర‌లు పోషిస్తూ వ‌స్తున్న శ‌ర్వానంద్ చివ‌రిగా ప‌డి ప‌డి లేచే మ‌న‌సు చిత్రం చేశాడు.మంచి రొమాంటిక్ చిత్రంగా తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తాకొట్టింది. అయితే ఇందులో శ‌ర్వానంద్ లుక్స్‌, ఆయ‌న న‌ట‌న ప్రేక్ష‌కులని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ప్ర‌స్తుతం సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు . ఇందులో శ‌ర్వానంద్ రెండు డిఫ‌రెంట్ గెట‌ప్స్ లో క‌నిపించ‌నున్నాడు. తాజాగా ఆయ‌న‌కి సంబంధించిన ఓ లుక్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. భారీ గడ్డంతో స‌రికొత్త హెయిర్ స్టైల్‌లో శర్వా లుక్ అదిరింద‌ని అభిమానులు చెప్పుకుంటున్నారు. ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం విదేశాల‌లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం స‌మ్మ‌ర్‌లో రిలీజ్ కానుంది. ఆ త‌ర్వాత త‌మిళ సూప‌ర్ హిట్ చిత్రం 96 రీమేక్ చేయ‌నున్నాడు శ‌ర్వానంద్‌. ఇందులో స‌మంత క‌థానాయిక‌గా న‌టించ‌నుంది.

2598
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles