ముస్లిం అయి ఉండి గణేషుడిని పూజిస్తావా..!

Mon,September 17, 2018 01:11 PM
Sharukh Khan trolled for Worshiping Ganesha

బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్‌ఖాన్‌పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు కొందరు ముస్లిం అభిమానులు. ఓ ముస్లిం అయి ఉండి ఇంట్లో గణేషుడి విగ్రహాన్ని పెట్టి పూజ చేస్తావా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్లు పెట్టారు. తన చిన్న కొడుకు అబ్‌రామ్ ఇంట్లో గణేషుడి విగ్రహానికి పూజ చేస్తున్న ఫొటోను షారుక్ అప్‌లోడ్ చేశాడు. మా గణపతి పప్పా ఇంటికి వచ్చేశాడు.. మా చిన్నోడు బప్పాను పప్పా అంటాడు అంటూ షారుక్ ఆ ఫొటోకు క్యాప్షన్ పెట్టాడు. అయితే దీనికి అతను ఊహించని కామెంట్లు వచ్చాయి. ఇస్లాంలో విగ్రహారాధన నిషేధమని, అలాంటప్పుడు నువ్వెలా పూజలు చేస్తావంటూ ప్రశ్నించారు. ఇది తప్పు.. నువ్వు ముస్లింవి.. గణేష్ చతుర్థి ఎలా జరుపుకుంటావు అని నిలదీశారు.


అయితే కొందరు మాత్రం షారుక్‌కు మద్దతుగా వచ్చారు. అందులో ముస్లింలు కూడా ఉన్నారు. నేను కూడా ఓ ముస్లిం అయినా.. గణేష్ పూజలో పాల్గొంటానని ఒకరు కామెంట్ చేయగా.. హిందూ, ముస్లిం కంటే ముందు మనం హిందుస్థానీ అన్న విషయం గుర్తించాలని మరొకరు అన్నారు.

9117
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles