నాలుగోసారి తండ్రి కాబోతున్న షారుక్!

Mon,January 22, 2018 04:24 PM
నాలుగోసారి తండ్రి కాబోతున్న షారుక్!

ఈ టైటిల్ చూడగానే ఏవేవో ఊహించుకోకండి. నిజమే.. షారుక్‌ఖానే స్వయంగా తాను నాలుగోసారి తండ్రి కాబోతున్నానని ఓ షోలో చెప్పాడు. అయితే అది నిజంగా కాదు. సెన్సాఫ్ హ్యూమర్ కాస్త ఎక్కువగానే ఉండే బాద్‌షా.. ఓ పేరు పలకడానికి రాని సందర్భంలో సరదాగా ఈ కామెంట్స్ చేశాడు. షారుక్ ప్రస్తుతం టెడ్ టాక్స్ ఇండియా నయీ సోచ్ షోను హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే కదా. ఈ షోలో భాగంగా అతను ఆకాంక్ష అన్న పేరును పలకడానికి రాక చాలా ఇబ్బంది పడ్డాడు. ఎన్నిసార్లు ట్రై చేసినా.. ఈ పేరును షారుక్ సరిగా పలకలేకపోయాడు. ఈ సందర్భంగానే అతను తన సెన్సాఫ్ హ్యూమర్‌ను కాస్త జోడిస్తూ.. ఈ పేరుతో చాలా ఇబ్బంది పడుతున్నా. ఇంతకుముందు నాకెప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. త్వరలోనే నాకు నాలుగో బిడ్డ పుట్టబోతున్నదనీ, ఆమెకు ఆకాంక్ష అని పేరు పెట్టాలని అనిపిస్తుంది అని షారుక్ అన్నాడు. దీంతో షోలో ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా గట్టిగా నవ్వారు. ప్రస్తుతం షారుక్‌ఖాన్ ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న జీరో మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

2861

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018