సోఫియా మాట‌ల‌కి ఫిదా అయిన షారూఖ్ ఖాన్

Fri,February 23, 2018 08:24 AM
సోఫియా మాట‌ల‌కి ఫిదా అయిన షారూఖ్ ఖాన్

ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో నూతన సాంకేతికతలు, కృత్రిమ మేధస్సు అంశాలపై ప‌లు చర్చలు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. కృత్రిమ మేధస్సుపై చర్చ సందర్భంగా మానవ రోబో సోఫియాను, దాని సృష్టికర్త అయిన డేవిడ్ హాన్సన్ ఇంటర్వ్యూ చేశారు. చిట్టి చిట్టి మాటలతో సోఫియా ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ప‌లు విష‌యాల‌పై మాట్లాడిన సోషియాని ఇష్ట‌మైన న‌టుడు ఎవ‌రు అని అడిగితే షారూక్ ఖాన్ అని చెప్పింది. సోఫియా అభిమానానికి క‌రిగిపోయిన షారూఖ్ వెంట‌నే త‌న ట్విట్ట‌ర్‌లో.. నా దేశానికి వ‌చ్చిన మ‌హిళ‌కు బ‌హిరంగంగా నా ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రుస్తున్నాను. అణువ‌ణువునా నన్ను అనుక‌రించావు సోఫియా అంటూ త‌న ప్రేమ‌ని వ్య‌క్త ప‌రిచాడు షారూఖ్ ఖాన్‌. ప్రస్తుతం షారుక్‌ఖాన్ ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న జీరో మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.


934

More News

VIRAL NEWS