బాక్సింగ్ దిగ్గ‌జంకి షారూఖ్ 5 ల‌క్ష‌ల‌ సాయం

Mon,December 18, 2017 11:42 AM
sharukh helps to boxer

ఈ మ‌ధ్య కాలంలో సినీ సెల‌బ్రిటీలు సోష‌ల్ కార్య‌క్ర‌మాల‌లో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. అంతేకాదు క‌ష్టాల‌లో ఉన్న వారికి త‌మ‌వంతు సాయం అందిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ బాక్సింగ్ దిగ్గ‌జం కౌర్ సింగ్‌(69)కి 5 ల‌క్ష‌ల రూపాయ‌ల సాయం అందించాడు. బాక్సింగ్ లెజెండ్‌ ముహమద్‌ అలీతో రింగ్‌లో తలపడిన ఏకైక భారతీయుడిగా ఘ‌న‌త సాధించిన కౌర్ సింగ్ కొంత కాలంగా గుండె జ‌బ్బుతో బాధ‌ప‌డుతున్నాడు.ఇటీవ‌లే ఆయ‌న డిశ్చార్జ్ అయ్యాడు. అయితే బాక్సింగ్‌లో గోల్డ్ మెడ‌ల్ సాధించిన కౌర్‌సింగ్ ప్ర‌స్తుతం మెడిక‌ల్ బిల్లు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నాడు. ఈ క్ర‌మంలో పంజాబ్‌ ప్రభుత్వం రెండు లక్షల చెక్‌ను ఆయనకు అందజేయగా.. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్‌ ఇండియా(బీఎఫ్‌ఐ) కూడా ఆయ‌న చికిత్స కోసం లక్ష రూపాయాలను అంద‌జేసింది. అయతే కౌర్ సింగ్ ఆరోగ్య ప‌రిస్థితుల‌ని ఇటీవ‌ల టైమ్స్ ఆఫ్ ఇండియా ప్ర‌చురించింది. దీనిపై స్పందించిన షారూఖ్ .. లెజండ‌రీ స్పోర్ట్స్ మ్యాన్‌కి న‌గదు సాయం అందించి మ‌రోసారి త‌న ద‌యాగుణం చాటాడు.

1964
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS