అందుకే అంత తొందరగా పెళ్లి చేసుకున్నా!

Sun,July 15, 2018 03:01 PM
Sharuk Khan reveals why he married so early

బాలీవుడ్ బాద్‌షా, కింగ్ ఆఫ్ రొమాన్స్‌గా షారుక్ ఖాన్‌ను అభిమానులు పిలుచుకుంటారు. తాను నటించిన సినిమాల్లో ఎక్కువగా లవర్ బాయ్ క్యారెక్టర్లే పోషించాడు షారుక్. స్క్రీన్‌పై కింగ్ ఖాన్ రొమాన్స్ చేశాడంటే ఆ సినిమా సూపర్ హిట్ అయినట్లే. అయితే అలాంటి షారుక్.. నిజ జీవితంలోనూ చాలా తొందరగా పెళ్లి చేసుకున్నాడు. దీని వెనుక కూడా ఓ కారణం ఉన్నట్లు షారుక్ చెప్పాడు. ఈ మధ్యే ఇన్‌స్టాగ్రామ్ తమ యూజర్లకు మిగతా యూజర్లను ఏదైనా ప్రశ్నలు అడిగే ఓ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో ఓ అభిమాని.. మీరెందుకు అంత త్వరగా పెళ్లి చేసుకున్నారు అని షారుక్‌ను ప్రశ్నించాడు. దీనికి షారుక్ సమాధానమిస్తూ.. ప్రేమ, అదృష్టం ఎప్పుడైనా వస్తాయి. గౌరితో నాకు రెండూ చాలా త్వరగానే వచ్చేశాయి అని చెప్పాడు.

8647
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS