కమల్ హాసన్ తో స్టార్ డైరెక్టర్ శంకర్ 'ఇండియన్ 2' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పస్ట్ లుక్ ను విడుదల చేశాడు శంకర్. భారతీయుడు సినిమా తీసేందుకు స్పూర్తినిచ్చిన సంఘటన ఏంటో శంకర్ షేర్ చేసుకున్నాడు. నేను కాలేజీలో చేరే సమయంలో కుల, ఆదాయ ధృవీకరణ పత్రం తీసుకునేందుకు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే..కొంతమంది అధికారులు నన్ను లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనే నన్ను భారతీయుడు సినిమా తీసేలా చేసిందని చెప్పాడు.
ప్రతీ సమస్య సామాన్య ప్రజానీకాన్ని ఎంత ఇబ్బందికి గురిచేస్తుందనే విషయం ఇండియన్ 2 లో చూపించనున్నట్లు తెలిపాడు. ఇవాళ సాయంత్రం ఈ చిత్రం నుంచి మరో పోస్టర్ ను విడుదల చేసింది శంకర్ టీం. తాజా లుక్ లో ఓల్డర్..వైజర్..డెడ్లియర్ క్యాప్షన్స్ తో మరింత పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు కమల్ హాసన్. రేపటి నుంచి ఇండియన్ 2 షూటింగ్ ప్రారంభం కానుంది.