మీరు లేకుండా నా ప్రయాణం సాధ్యపడదు: శంక‌ర్

Tue,July 31, 2018 12:44 PM
shankar shares his assistants group pic

సుప్ర‌సిద్ధ ద‌ర్శ‌కుడు శంక‌ర్ గురించి ప్రత్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. 1996లో క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో భార‌తీయుడు అనే సినిమాని తెర‌కెక్కించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాడు. ఆ త‌ర్వాత ప‌లు సూప‌ర్‌హిట్ సినిమాలు తెర‌కెక్కించిన శంక‌ర్ 2010లో రోబో అనే సినిమా తెర‌కెక్కించి ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించాడు. ప్ర‌స్తుతం ఆ సినిమాకి సీక్వెల్‌గా 2.ఓ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీజాక్సన్ , సుధాన్సు పాండే, అదిల్ హుస్సేన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం 450 కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం న‌వంబర్ 29న విడుద‌ల కానుంది. అయితే ఇటీవ‌ల చిత్రానికి సంబంధించిన టెక్నీషియన్స్‌లో ఒక‌రైన రెసుల్ పూకుట్టి త‌న ట్విట్ట‌ర్ ద్వారా రోబో 1, రోబో 2 చిత్రాలని రూపొందించే స‌మయంలో శంక‌ర్‌తో దిగిన ఫోటోలు షేర్ చేశారు. ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి. తాజాగా శంక‌ర్ త‌న అసిస్టెంట్ డైరెక్ట‌ర్స్‌తో క‌లిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ .. నా స‌హ‌య‌కులు చూపించిన ఆప్యాయ‌త వ‌ల‌న ఈ సినిమా చేయ‌గ‌లుగుతున్నాను. మీరు లేకుండా నా ప్ర‌యాణం సాధ్య‌ప‌డ‌దు అని ట్వీట్ చేశారు.శంక‌ర్ టీంని చూసి అభిమానులు ఆశ్చ‌ర్య‌చ‌కితుల‌వుతున్నారు.


2219
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles