సాహో టీం నుంచి మ్యూజిక్ డైరెక్టర్లు అవుట్!

Mon,May 27, 2019 05:55 PM
Shankar-Ehsaan-Loy are quit from saaho

సుజిత్ డైరెక్షన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా సాహో చిత్రం తెరకెక్కుతున్నవిషయం తెలిసిందే. రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో సాహో రూపుదిద్దుకుంటోంది. అయితే సాహో చిత్రయూనిట్ అందరికీ ఊహించని షాక్ ఇచ్చింది. హై ఓల్టేజీ స్టైలిష్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం నుంచి మ్యూజిక్ డైరెక్టర్లు తప్పుకున్నారు. శంకర్-ఇషాన్-లాయ్ సంగీతదర్శకత్రయం ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. సాహో చిత్రానికి సరిపడే మరో మ్యూజిక్ డైరెక్టర్ కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారట దర్శకుడు అండ్ టీం.

బాలీవుడ్ లో పలు బ్లాక్ బ్లాస్టర్ చిత్రాలకు సంగీతం అందించిన శంకర్-ఇషాన్-లాన్ త్రయం సాహోకు సరిపడా ట్యూన్స్ ఇవ్వడంలో ఫెయిల్ అవడంతో..డైరెక్టర్ సుజీత్ మరో మ్యూజిక్ డైరెక్టర్ ను ఎంపిక చేసే పనిలో ఉన్నాడని టాక్. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ గిబ్రాన్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే వరకు తెలుస్తుంది.

బాలీవుడ్ నటి శ్రద్దాకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. నీల్ నితిన్ ముఖేశ్, వెన్నెల కిశోర్ , మురళీ శర్మ, జాకీష్రాఫ్, మందిరా బేడీ, అరుణ్ విజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

3154
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles