‘అపరిచితుడు’ టైంలో శంకర్ పిల్లాడిలా ఏడ్చాడట..

Wed,May 16, 2018 06:49 PM
shankar cried like a baby in aparichutudu shoot says silva


విక్రమ్, సదా కాంబినేషన్‌లో వచ్చిన అపరిచితుడు సినిమా రికార్డులు సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. శంకర్ దర్శకత్వం వహించిన తెలుగు, తమిళ భాషల్లో విడుదలై సూపర్‌హిట్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ శంకర్ చిన్న పిల్లాడిలాగా ఏడ్చాడట. ఈ విషయాన్ని అపరిచితుడు స్టంట్ డైరెక్టర్, యాక్టర్ సిల్వ ఓ ఇంటర్క్యూలో వెల్లడించాడు.

అపరిచితుడు సినిమాలోని ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలను ఓ స్టేడియంలో పీటర్ హెయిన్స్ మాస్టర్ నేతృత్వంలో చిత్రీకరిస్తున్నాం. సీన్ కోసం 150 మంది స్టంట్‌మ్యాన్లు షూట్‌లో పాల్గొనాలి. సీన్ ప్రకారం యాక్షన్ చెప్పగానే సుమారు 70 మంది స్టంట్‌మ్యాన్లు ఒకేసారి గాల్లోకి లేచి కిందపడాలి. దీనికోసం స్టంట్‌మ్యాన్స్ అందరికీ తాళ్లు కట్టాం. ఒకేసారి అందరినీ పైకి లాకేందుకు స్టేడియం బయట లారీని ఉంచాం. డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే లారీ డ్రైవర్ ముందుకెళ్లాలి. అయితే డ్రైవర్ మాత్రం యాక్షన్ అని చెప్పకుండానే లారీని ముందుకు నడిపాడు. దీంతో ఒక్కసారిగా స్టంట్‌మ్యాన్లు అందరూ స్టేడియంపైన ఉన్న రూప్‌టాప్‌కు తాకి కిందపడ్డారు. చాలా మందికి గాయాలయ్యాయి. స్టేడియం రక్తమయమైంది. అపుడు మేమంతా అప్రమత్తమై వారిని ఆస్పత్రికి తరలించి కాపాడుకోగలిగాం. డైరెక్టర్ శంకర్ మాత్రం ఆ ఘటన జరిగిన తర్వాత చిన్న పిల్లాడిలా ఏడుస్తూ..తీవ్ర వేదనకు లోనయ్యారని ఘటన జరిగిన తీరును చెప్పుకొచ్చాడు సిల్వ.

3123
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS