క‌పూర్ కుటుంబం నుంచి అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా..

Mon,February 18, 2019 04:52 PM
Shanaya Kapoor Entry into Bollywood as assistant director

బాలీవుడ్ లో క‌పూర్ కుటుంబం నుంచి చాలా మంది టాప్ హీరోహీరోయిన్లుగా కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అనిల్ క‌పూర్, సోన‌మ్ క‌పూర్, అర్జున్ క‌పూర్‌, జాన్వీక‌పూర్ ఇలా అంద‌రూ అభిమానుల‌కి వినోదాన్ని అందిస్తున్నారు. అయితే తాజాగా క‌పూర్ కుటుంబం నుంచి మ‌రో వ్య‌క్తి సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధం కాబోతున్నారు. న‌టుడు, నిర్మాత సంజ‌య్ క‌పూర్ కూతురు శ‌న‌య‌క‌పూర్ ప‌రిశ్ర‌మ‌లో ఎంట్రీ ఇస్తోంది. అయితే శ‌న‌య క‌పూర్ నటిగా కాకుండా అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా త‌న ప్రతిభ‌ను నిరూపించుకోనుంది. ఈ విష‌యాన్ని సంజ‌య్ ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించాడు.

ల‌క్నోలో షూటింగ్ ప్రారంభ‌మైన చిత్రానికి శ‌న‌యా క‌పూర్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేస్తోంది. నా కూతురు రెండు వారాల‌పాటు ల‌క్నో వెళ్లింది. అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా జీవితాన్ని ప్రారంభిస్తున్న శ‌న‌య‌కు శుభాకాంక్ష‌లు అంటూ కామెంట్ పోస్ట్ చేశాడు సంజ‌య్ క‌పూర్‌. అయితే కూతురు ఎంట్రీ ఇస్తున్న సినిమా వివ‌రాల‌ను మాత్రం చెప్ప‌లేదు.

View this post on Instagram

All the best Shanaya ❤️#newbeginnings #newjourney

A post shared by Sanjay Kapoor (@sanjaykapoor2500) on

2062
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles