సావిత్రి చిత్రంలో అర్జున్ రెడ్డి భామ‌..!

Sun,September 10, 2017 12:21 PM
Shalini Pandey  palys a crucial role in mahanati

ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం ఫేం నాగ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ మ‌హాన‌టి. సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్క‌తున్న ఈ చిత్రంలో సావిత్రి పాత్ర‌ని కీర్తి సురేష్ పోషిస్తుండ‌గా, జెమినీ గ‌ణేష‌న్ పాత్ర‌లో దుల్క‌ర్ స‌ల్మాన్ క‌నిపించ‌నున్నాడు. సావిత్రి జీవితంలో జరిగిన సంఘటనలు తెలుసుకునే జర్నలిస్ట్ పాత్రలో సమంత కనిపించనుంది. ఇక‌ అర్జున్ రెడ్డి చిత్రంతో ఫుల్ పాపుల‌ర్ అయిన‌ విజయ్ దేవరకొండ ..సమంతకి భర్తగా కనిపించనున్నాడ‌నే టాక్స్ న‌డుస్తుండ‌గా, అదే చిత్రంలో హీరోయిన్‌గా న‌టించిన షాలిని పాండే మ‌హానటిలో ఓ ముఖ్య పాత్ర‌కి ఎంపికైంద‌ట‌. అర్జున్ రెడ్డి చిత్రంలో షాలిని న‌ట‌నకి ఫుల్ ఇంప్రెస్ అయిన‌ నాగ అశ్విన్ మ‌హ‌న‌టిలో ఈ యంగ్ బ్యూటీకి ఆఫ‌ర్ ఇచ్చాడ‌ని టాక్. విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ నిర్మాత అలూరి చ‌క్రపాణి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు . తెలుగు,తమిళ భాషలలో భారీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సి. అశ్వినీదత్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్వప్నా దత్ నిర్మాణంలో రూపొందుతుంది . భారీ ప్రాజెక్ట్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

3331
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS