త‌దుప‌రి సినిమాల‌పై క్లారిటీ ఇచ్చిన అర్జున్ రెడ్డి భామ‌

Thu,September 14, 2017 02:39 PM
త‌దుప‌రి సినిమాల‌పై క్లారిటీ ఇచ్చిన అర్జున్ రెడ్డి భామ‌

అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన షాలిని పాండే ఇటు టాలీవుడ్‌, అటు కోలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌ల దృష్టిని ఆక‌ర్షించింది. దీంతో ఈ అమ్మ‌డికి వ‌రుస ఆఫ‌ర్స్ క్యూ క‌డుతున్నాయ‌ని వార్తలు వ‌చ్చాయి. దీనిపై ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది. ఓ అభిమాని ‘‘మహానటి’ చిత్రంలో నటిస్తున్నారా?’ అని ప్రశ్నించగా, ‘అవును.. నటిస్తున్నా’ అని షాలిని చెప్పారు. మ‌రి తన పాత్ర ఏంట‌నేది ఇప్పుడే చెప్పనన్నారు. జ‌మున పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌నేది ఫిలింన‌గ‌ర్ టాక్. ఇక 100శాతం కాద‌ల్ అనే త‌మిళ సినిమాకి కూడా తాను సంత‌కం చేసిన‌ట్టు తెలిపింది షాలిని. అయితే ఇవే కాకుండా మ‌రికొన్ని సినిమాలకి సంతకం చేశానని, వివరాలను త్వరలోనే ప్రకటిస్తానని పేర్కొన్నారు. ఇక టాలీవుడ్‌లో తనకు ఇష్టమైన నటుడు ఎవ‌రంటే విజయ్‌ దేవరకొండ అని షాలిని తెలిపారు. తాజాగా ఈ అమ్మడు నెల్లూరులో ఓ షాప్ ఓపెనింగ్‌కి వెళ్ళి అస్వ‌స్థ‌త‌కి గురి కాగా, నిర్వాహకులు వెంటనే ఆస్పత్రికి త‌ర‌లించారు. డాక్ట‌ర్స్ ప్ర‌ధ‌మ చికిత్స అందించి వెంట‌నే షాలినిని డిశ్చార్జ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

830
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS