నాపై వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వాలు: అర్జున్ రెడ్డి భామ‌

Wed,September 13, 2017 03:57 PM
shalini pandey clarity about her heALTH

అర్జున్ రెడ్డి చిత్రంతో ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన భామ షాలిని పాండే. ఈ చిత్రంలో షాలిని న‌ట‌న‌కి ఇంప్రెస్ అయిన నిర్మాత‌లు ఒక్క‌సారిగా ఈ అమ్మ‌డికి వ‌రుస ఆఫ‌ర్స్ ఇస్తున్నారు. మ‌హాన‌టి చిత్రంలో షాలిని పాండే జ‌మునగా న‌టిస్తుంద‌నే టాక్ వినిపిస్తుండ‌గా, త‌మిళ చిత్రం 100శాతం కాద‌ల్ అనే చిత్రంలోను ఈ అమ్మ‌డు సెల‌క్ట్ అయిన‌ట్టు స‌మాచారం. అయితే అర్జున్ రెడ్డి క్రేజ్‌తో షాలిని పాండేని ప‌లు షాప్ ఓపెనింగ్స్‌కి కూడా ఇన్విటేషన్స్ అందుతున్నాయి. తాజాగా ఈ భామ సెల్ ఫోన్ షాప్ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరు కాగా, పెద్ద సంఖ్యలో అభిమానుల హాజరయ్యారు. దీంతో ఆమె కాస్త అస్వ‌స్థ‌త‌కి లోన‌య్యారు. అయితే వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు. కాని సోష‌ల్ మీడియాలో షాలిని తీవ్ర అస్వ‌స్థ‌త‌కి గుర‌య్యారంటూ వార్త‌లు రావ‌డంతో ఆమె స‌న్నిహితులు, శ్రేయోభిలాషులు వెంట‌నే షాలినికి కాల్ చేసి ఆరోగ్య ప‌రిస్థితులు తెలుసుకున్నారు. కాని అభిమానులు మాత్రం ఆమెకి ఏమైందో తెలియ‌క ఆందోళ‌న‌లో ఉన్నారు. ఈ క్ర‌మంలో షాలిని త‌న సోష‌ల్ మీడియా పేజ్ లో కొద్దిగా తలనొప్పి, జ్వరం ఉంటే ఆసుపత్రికి వెళ్లానని, అంతే తప్ప కొన్ని మీడియాల్లో వస్తున్నట్టు తీవ్ర అస్వస్థత కాదని తెలిపింది. దీంతో రూమ‌ర్స్‌కి బ్రేక్ ప‌డింది.

3572
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS