శ్రద్దాకపూర్ పెళ్లి వార్తలపై శక్తికపూర్ ఏమన్నాడంటే..?

Thu,July 11, 2019 09:21 PM


బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్‌, తన బాయ్‌ఫ్రెండ్‌ రోషన్‌ శ్రేష్టను పెళ్లిచేసుకోనుందంటూ.. ముంబైలో స్థానిక మీడియా ఓ కథనంలో వెల్లడించింది. దీంతో ఈ వార్త కాస్తా తెగ వైరల్ అయింది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా శక్తి కపూర్‌ దగ్గర శ్రద్దాకపూర్ పెళ్లి విషయాన్ని ప్రస్తావించింది. అయితే దీనికి తనదైన రీతిలో జవాబిచ్చారు శక్తికపూర్.


‘నిజమా..నా కూతురు పెళ్లి చేసుకోబోతుందా..? ఎక్కడ..ఎపుడు. ఓ తండ్రిగా నేను అక్కడుండాలి కదా. కానీ ఈ పెళ్లి గురించి నాకేం తెలీదు. దయచేసి నా కూతురు పెళ్లికి నన్ను పిలవడం మర్చిపోకండే’ అంటూ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. తన కూతురు పెళ్లి గురించి వస్తోన్న వార్తలన్నీ పుకార్లేనని శక్తికపూర్ కొట్టి పారేశారు. శ్రద్దాకపూర్ ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి సుజీత్ దర్శకత్వంలో వస్తోన్న సాహో చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదలకానుంది.

2551
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles