శ్రద్ధా క‌పూర్ పెళ్ళిపై స్పందించిన ఆమె తండ్రి

Sat,March 23, 2019 11:28 AM

బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ కొద్ది రోజులుగా రోహాన్ శ్రేష్ఠ అనే ఫోటోగ్రాఫ‌ర్‌తో ప్రేమాయ‌ణంలో ఉంద‌ని, వారి వివాహం 2020లో జ‌ర‌గ‌నుంద‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై శ్ర‌ద్ధా తండ్రి శ‌క్తి క‌పూర్ స్పందించారు. అవ‌న్నీ అవాస్త‌వాలు. వాటిలో ఎలాంటి నిజం లేదు. ఆమె మ‌రో ఐదేళ్ళు పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా లేదు. ప్ర‌స్తుతం ఆమె చేతిలో ప‌లు ప్రాజెక్టులు ఉన్నాయి. రెండేళ్ళ వ‌ర‌కు క్యాలెండ‌ర్ బిజీగా ఉంది. ఆమె త‌న జీవితంలో సంతోషంగా ఉంది. పేరెంట్స్ అనుమ‌తి లేకుండా శ్ర‌ద్దా వివాహం చేసుకోదు అని శ‌క్తి అన్నారు. అలానే రోహ‌న్ గురించి ప్ర‌శ్నించ‌గా, అత‌ని తండ్రి రాకేశ్ నాకు మంచి మిత్రుడు. మేం ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావ‌డంతో వారిద్ద‌రు స్నేహితుల్లా ఉంటున్నారు. నా కుమార్తె త‌న జీవితంలో జ‌రిగే ప్ర‌తి విష‌యం నాకు చెబుతుంది. ఆధారాలు లేకుండా త‌ప్పుడు వార్త‌ల‌ని ప్రచురించ‌కండి అని శ‌క్తి కపూర్ స్ప‌ష్టం చేశారు. శ్ర‌ద్ధా క‌పూర్ సాహో చిత్రంతో పాటు చిచ్చోరే, ఏబీసీడీ 3, బాఘీ 3 చిత్రాల‌లో నటిస్తుంది . డెంగ్యూ వ‌ల‌న తాను సైనా నెహ్వాల్ బ‌యోపిక్ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్న విష‌యం విదిత‌మే.

2094
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles