ఆగ‌స్ట్‌లో విడుద‌ల కానున్న ష‌కీలా బ‌యోపిక్ ..!

Sun,June 23, 2019 10:23 AM
Shakeela biopic To Release On THIS Month

రీచా చ‌ద్దా ప్ర‌ధాన పాత్ర‌లో సౌత్ న‌టి ష‌కీలా బ‌యోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ష‌కీలా అనే టైటిల్‌తోనే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నేను పోర్న్ స్టార్ కాదు అనేది క్యాప్ష‌న్. స్టార్ హీరోల స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న అడ‌ల్ట్ స్టార్ ష‌కీలా బ‌యోపిక్‌ని ఇంద్ర‌జిత్ లోకేష్ తెర‌కెక్కిస్తున్నాడు. 2018లోనే ఈ చిత్ర షూటింగ్ పూర్తైన‌ప్ప‌టికి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల వ‌ల‌న రిలీజ్ లేట్ అవుతూ వ‌స్తుంది. తెలుగు‌తో పాటు హిందీ, మలయాళం, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం నిరుపేద నుంచి ధనికురాలై మళ్లీ పేదగా మారిన వ్యక్తి కథగా రూపొందుతుంద‌ని స‌మాచారం. మ్యాజిక్‌ సినిమా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ష‌కీలా కూడా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఇప్ప‌టికే చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా , ఇందులో రిచా భారీ న‌గ‌ల‌తో స‌రికొత్త లుక్‌లో కనిపించింది. ఆగ‌స్ట్‌లో చిత్రాన్ని త‌ప్ప‌క రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

1294
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles