ష‌కీలా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Tue,November 20, 2018 01:06 PM
Shakeela biopic first look released

స్టార్ హీరోల స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న అడ‌ల్ట్ స్టార్ ష‌కీలా. ప్ర‌స్తుతం ఆమె జీవిత నేప‌థ్యంలో ష‌కీలా అనే బ‌యోపిక్ రూపొందుతుంది. ఇంద్ర‌జిత్ లోకేష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టి రిచా చ‌ద్దా .. ష‌కీలా పాత్రని పోషిస్తుంది. రీసెంట్‌గా ఈ సినిమా టైటిల్‌ లోగోను విడుదల చేశారు. ఇందులో నేను పోర్న్ స్టార్ కాదు అని క్యాప్షన్ ఉండ‌డం సినిమాపై ఆస‌క్తిని క‌లిగించింది. తెలుగు‌తో పాటు హిందీ, మలయాళం, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం నిరుపేద నుంచి ధనికురాలై మళ్లీ పేదగా మారిన వ్యక్తి కథగా రూపొంద‌తుంద‌ని స‌మాచారం. మ్యాజిక్‌ సినిమా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ష‌కీలా కూడా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. తాజాగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో రిచా భారీ న‌గ‌ల‌తో స‌రికొత్త లుక్‌లో క‌నిపిస్తుంది. పోస్ట‌ర్ బ్యాక్ గ్రౌండ్‌లో హిందీ ప‌దాలు రాసి ఉన్నాయి. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు.

2051
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles