అలరించిన 'శైలజా రెడ్డి అల్లుడు'.. ట్రైలర్

Fri,August 31, 2018 01:05 PM
Shailaja Reddy Alludu Official Trailer

నాగ చైత‌న్య, అను ఎమ్యాన్యుయేల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో మారుతి తెర‌కెక్కించిన చిత్రం శైల‌జా రెడ్డి అల్లుడు. ఈ చిత్రంలో సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ అత్త పాత్ర‌లో న‌టించారు. ప్రేమమ్, బాబు బంగారం వంటి చిత్రాలు నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ శైల‌జా రెడ్డి అల్లుడు చిత్రాన్ని రూపొందిస్తుంది. శైల‌జా రెడ్డి చిత్రం కుటుంబ క‌థా చిత్రంగా ప్రేక్ష‌కుల‌ని తప్ప‌క అల‌రిస్తుంద‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. చిత్రానికి సంబంధించి రీసెంట్ గా విడుద‌లయిన టీజర్, సాంగ్స్ ప్రేక్ష‌కుల‌లో సినిమాపై అంచ‌నాలు పెంచుతున్నాయి. సెప్టెంబర్ 13 న రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ ను మూవీ యూనిట్ ఇవాళ రిలీజ్ చేసింది. ట్రైలర్ ఆద్యంతం ప్రేక్ష‌కులను అలరించేవిధంగా ఉంది.

73
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS