ట్రైలర్‌తో అంచ‌నాలు పెంచిన నాగ చైత‌న్య‌

Fri,August 31, 2018 01:00 PM
Shailaja Reddy Alludu Official Trailer

నాగ చైత‌న్య, అను ఎమ్యాన్యుయేల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో మారుతి తెర‌కెక్కించిన చిత్రం శైల‌జా రెడ్డి అల్లుడు . ఈ చిత్రంలో సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ అత్త పాత్ర‌లో న‌టించారు . ప్రేమమ్, బాబు బంగారం వంటి చిత్రాలు నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ శైల‌జా రెడ్డి అల్లుడు చిత్రాన్ని రూపొందిస్తుంది. శైల‌జా రెడ్డి చిత్రం కుటుంబ క‌థా చిత్రంగా ప్రేక్ష‌కుల‌ని తప్ప‌క అల‌రిస్తుంద‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. సెప్టెంబ‌ర్ 13న‌ మూవీ విడుద‌లకి ప్లాన్ చేస్తుండ‌గా, నిర్మాత‌లు మూవీపై ఆస‌క్తి క‌లిగేలా భారీ ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. ఇటీవ‌ల చిత్రానికి సంబంధించి ప‌లు సాంగ్స్ విడుద‌ల చేసిన టీం తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో చైతూ చాలా స్టైలిష్‌గా క‌నిపిస్తున్నాడు. ట్రైల‌ర్‌తో సినిమాపై భారీ అంచ‌నాలు పెరిగాయి. ఇక ట్రైల‌ర్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు సినిమాటోగ్రఫీ చాలా అందంగా ఉంది. గోపిసుంద‌ర్ చిత్రానికి స్వ‌రాలు స‌మకూర్చారు . తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

2653
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS