చైతూ చిత్రం కోసం మంగ్లీ పాడిన పాట ఇదే..!

Sat,August 18, 2018 12:09 PM
Shailaja Reddy Alludu Choode Lyrical song released

నాగ చైత‌న్య ప్ర‌స్తుతం మారుతి ద‌ర్శ‌క‌త్వంలో శైల‌జా రెడ్డి అల్లుడు అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అను ఎమ్మాన్యుయేల్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ అత్త పాత్ర‌లో న‌టించారు . ప్రేమమ్, బాబు బంగారం వంటి చిత్రాలు నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ శైల‌జా రెడ్డి అల్లుడు చిత్రాన్ని రూపొందిస్తుంది. శైల‌జా రెడ్డి చిత్రం కుటుంబ క‌థా చిత్రంగా ప్రేక్ష‌కుల‌ని తప్ప‌క అల‌రిస్తుంద‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. అతి త్వ‌ర‌లోనే మూవీ విడుద‌లకి ప్లాన్ చేస్తుండ‌గా, నిర్మాత‌లు మూవీపై ఆస‌క్తి క‌లిగేలా పోస్ట‌ర్స్ లేదా లిరిక‌ల్ వీడియో సాంగ్స్ విడుద‌ల చేస్తున్నారు. తాజాగా గోపిసుంద‌ర్ సంగీతంలో రూపొందిన 'శైలజా రెడ్డి అల్లుడు జూడే ..సాంగ్ విడుద‌ల చేశారు. తెలంగాణ యాసలో సత్యవతి (మంగ్లీ) పాడిన ఈ పాట ప్ర‌తి ఒక్క‌రిని అలరిస్తుంది. మ‌రి మీరు ఈ సాంగ్ విని ఎంజాయ్ చేయండి.

5105
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS