షారుక్ బంధువు నామినేషన్ స్వీకరించిన ఈసీ

Wed,June 13, 2018 04:54 PM
Shahrukh Khan cousin Nomination accepted in pakistan


పెషావర్ : బాలీవుడ్ నటుడు షారుక్‌ఖాన్ బంధువు నూర్ జహాన్ పాకిస్తాన్‌లో జరుగనున్న ఎన్నికల్లో పోటీచేస్తున్న విషయం తెలిసిందే. నూర్ జహాన్ నామినేషన్ పత్రాలను పాక్ ఎన్నికల సంఘం స్వీకరించింది. పెషావర్ పట్టణ పరిధిలోని ఖైబర్ పంఖ్తువా ప్రావిన్స్ నుంచి నూర్ జహాన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుంది. నూర్ జహాన్ మొదట అవామీ నేషనల్ పార్టీ (ఏఎన్‌పీ) నుంచి ఇదే స్థానం నుంచి మహిళా రిజర్వేషన్ కేటగిరిలో పోటీ చేసేందుకు ప్రయత్నించింది. అయితే కొన్ని కారణాల్ల ఆమెకు అవకాశం ఇవ్వలేదు. దీంతో నూర్ జహాన్ స్వతంత్రంగా పోటీ చేసేందుకు సిద్ధమవగా..ఈసీ ఆమె నామినేషన్‌ను స్వీకరించింది.

1500
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles