స‌ల్మాన్ తండ్రిని బెదిరించిన అభిమాని

Wed,November 21, 2018 10:11 AM
Shahrukh Arrested in UP for Threatening Salman Khan Father

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్‌కి దేశ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే . ప్ర‌స్తుతం టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ 12కి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తూనే మ‌రో వైపు భార‌త్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ పంజాబ్ ప‌రిస‌ర ప్రాంతాల‌లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. అయితే తాజాగా స‌ల్మాన్ ఖాన్ తండ్రి స‌లీం ఖాన్‌కి ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్ రాజ్ ప్రాంతానికి చెందిన షారుక్‌ గులాం నబీ అనే వ్య‌క్తి కాల్ చేసి బెదిరించాడ‌ట‌. అత‌ను స‌ల్మాన్ ఖాన్ వీరాభిమాని అని తెలుస్తుంది.

షారుక్‌ గులాం నబీ స‌ల్మాన్‌ని ఒక్క‌సారైన క‌ల‌వాల‌ని ఎప్ప‌టి నుండో క‌ల‌లు కంటున్నాడట‌. అయితే ఇటీవ‌ల స‌ల్మాన్ అసిస్టెంట్ బిబాష్‌ నెంబర్‌ తెలుసుకుని అత‌నికి కాల్ చేశాడు షారుక్. తాను స‌ల్మాన్ అభిమానినని చెప్పి, ఒక్క‌సారి క‌లిసే ఏర్పాట్లు చేయ‌మని అడిగాడ‌ట‌. అందుకు బిబాష్ ఒప్పుకోక‌పోవ‌డంతో డైరెక్ట్‌గా స‌ల్మాన్ తండ్రి స‌లీంకి కాల్ చేసి తాను గ్యాంగ్ స్టర్ ఛోటా షకీల్‌తో కలిసి పనిచేసేవాడినని, సల్మాన్‌తో మీటింగ్‌ ఏర్పాటుచేయకపోతే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని హెచ్చ‌రించాడ‌ట‌. దీంతో స‌ల్మాన్ అసిస్టెంట్ ఈ విష‌యాన్ని ముంబై పోలీసుల‌కి ఫిర్యాదు చేయ‌గా, వారు ఫోన్ కాల్ ఆధారంగా నిందితుడిని శోధించి అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌స్తుతం షారూఖ్‌ని విచారిస్తున్న పోలీసులు త్వ‌ర‌లో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

1216
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles