సినిమాలు లేవని బాధపడుతున్న స్టార్ హీరో!

Mon,June 17, 2019 07:37 PM
Shahidkapoor worried about his unemployment


ఎంత మంచి నటుడైనా ఒక్కోసారి టైం బాగాలేకపోతే చేతిలో ఒక్క సినిమా కూడా ఉండదు. ఇపుడు అలాంటి పరిస్థితే బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కు ఎదురైనట్లు కనిపిస్తోంది. ఇటీవల షాహిద్ మాట్లాడిన మాటలు వింటే ఇది నిజమేననిపిస్తోంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కబీర్ సింగ్ చిత్రంలో నటిస్తున్నాడు షాహిద్. ఈ సినిమా ట్రైలర్ కు అద్బుతమైన స్పందన వస్తోంది.

కబీర్ సింగ్ ప్రమోషన్స్ లో పాల్గొన్న షాహిద్ మీడియాతో మాట్లాడుతూ..కబీర్ సింగ్ తర్వాత తన చేతిలో ఒక్క సినిమా కూడా లేదని చెప్పాడు. ఇది చాలా నిరాశ కలిగించే విషయమన్నాడు. కబీర్ సింగ్ సినిమా విడుదల తర్వాత తాను ఉపాధి లేకుండా పోతానేమోనని బాధపడుతున్నట్లు చెప్పాడు. ఒకవేళ టైం కుదిరితే కబీర్ సింగ్ టీంతో కలిసి మళ్లీ పనిచేయాలని ఉందని మనసులో మాట చెప్పాడు ఈ పద్మావత్ స్టార్. కబీర్ సింగ్ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

8174
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles