నిర్మాతగా మారనున్న ‘పద్మావత్’ హీరో

Wed,February 20, 2019 04:25 PM
shahidkapoor to turn as producer with biopic

బాలీవుడ్ లో స్టార్‌డమ్ సొంతం చేసుకున్న చాలా మంది నటీనటులు నిర్మాతలుగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, దీపికాపదుకొనే నిర్మాతలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజాగా స్టార్ హీరో నిర్మాతగా మారేందుకు సిద్ధమయ్యాడు. బాలీవుడ్ నటుడు షాహిద్‌కపూర్ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నాడు.

ఆసియన్ గేమ్స్ బంగారు పతక విజేతగా నిలిచిన బాక్సర్ డింగ్‌కో సింగ్ జీవితకథ ఆధారంగా బయోపిక్‌కు సన్నాహాలు చేస్తున్నారు. షాహిద్‌కపూర్ నిర్మాత, దర్శకుడు రాజ్‌కృష్ణమీనన్ తో కలిసి (సహనిర్మాతగా) ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ముంబై మిర్రర్ ఓ కథనంలో వెల్లడించింది. బయోపిక్ ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది. ఈ ఏడాది చివరలో సినిమాను ప్రారంభించనున్నట్లు టాక్. ఈ చిత్రం జనవరిలోనే సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉండగా..కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.

989
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles