మొన్న ర‌ణ్‌వీర్‌.. నేడు షాహిద్ క‌పూర్‌

Tue,April 17, 2018 08:20 AM
shahid selected for Dadasaheb Phalke Excellence Award 2018

దాదా సాహెబ్ ఫాల్కే ఫౌండేష‌న్ ఇండ‌స్ట్రీకి సంబంధించిన ద‌ర్శ‌కులు,నటులు, నిర్మాత‌ల ప్ర‌తిభ‌ని గుర్తించి వారిని ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఎక్స్‌లెన్స్‌ అవార్డు’తో స‌త్క‌రించాల‌నుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ప్ర‌తిభ ఉన్న ప‌లువురు పేర్ల‌ని ఎనౌన్స్ చేసిన నిర్వాహ‌కులు తాజాగా షాహిద్ క‌పూర్ పేరు వెల్ల‌డించారు. సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కించిన ప‌ద్మావ‌తి చిత్రంలో మ‌హారావ‌ల్ ర‌తన్ సింగ్ పాత్ర పోషించి అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రించిన షాహిద్‌ని ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఎక్స్‌లెన్స్‌ అవార్డు’కి ఎంపిక చేసినట్లు అవార్డు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ప‌ద్మావ‌తి చిత్రంలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్ర పోషించిన రణ్‌వీర్‌ని కూడా ఎక్స్‌లెన్స్ అవార్డుకి ఎంపిక చేశారు. నిర్మాతగా అనుష్క ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఎక్స్‌లెన్స్‌ అవార్డుకి ఎంపిక కాగా, తమ‌న్నా,రాణీ ముఖర్జీ, అదితిరావు హైదరి, రాజ్‌కుమార్‌ రావు, కృతిసనన్‌ కూడా ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. మే 3న దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఆ రోజు వీరు అవార్డులు అందుకోనున్నారు.

2224
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles