90 ల‌క్ష‌ల కారు కొన్న అర్జున్ రెడ్డి ..!

Sat,August 4, 2018 10:44 AM
shahid purchased costly car

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ క‌పూర్ ప‌ద్మావ‌తి చిత్రం త‌ర్వాత న‌టిస్తున్న చిత్రం అర్జున్ రెడ్డి. తెలుగు వ‌ర్షెన్‌కి రీమేక్‌గా తెరకెక్క‌నున్న‌ ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగానే తెర‌కెక్కించ‌నుండగా, మూవీ టైటిల్ కూడా అదే పెట్టాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. ఆగష్టు మొదటి వారంలో హిందీ అర్జున్ రెడ్డి చిత్రం చిత్రీకరణ మొదలవ్వనుంది. వచ్చే ఏడాది జూన్ 21వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ విడుదల చెయ్యాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవ‌ల ముంబైలో 50 కోట్ల రూపాయ‌లు విలువ చేసే ఫ్లాట్‌ని షాహిద్ కొన్న సంగ‌తి తెలిసిందే. సముద్రపు అంచున ఉన్న అపార్ట్‌మెంట్లో, బీచ్‌వ్యూ తో ఆ ఫ్లాట్ అదిరిపోయేలా ఉంటుందని బాలీవుడ్ మీడియా చెబుతోంది.

కాస్ట్‌లీ ఫ్లాట్‌తో వార్త‌ల‌లోకి ఎక్కిన షాహిద్ క‌పూర్ ఇప్పుడు మ‌రోసారి కొత్త కారుతో హాట్ టాపిక్‌గా నిలిచాడు. బెన్స్ కంపెనీకి చెందిన కొత్త కారుతో జిమ్ బ‌య‌ట షాహిద్ క‌నిపించ‌డంతో ఆయ‌న‌ని కెమెరాలో బంధించారు ఫోటో గ్రాఫ‌ర్స్‌. షాహిద్ కారు ధ‌ర 90 ల‌క్ష‌ల‌కి పైగా ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రోవైపు షాహిద్ క‌పూర్ త్వ‌ర‌లో మ‌రోసారి తండ్రి కాబోతున్నాడు. మొత్తానికి ఈ ఏడాది షాహిద్‌కి బాగానే క‌లిసొచ్చిన‌ట్టుంది.

5225
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles