పద్మావతిలో షాహిద్ కపూర్ ఇలా..

Thu,October 12, 2017 10:40 AM
పద్మావతిలో షాహిద్ కపూర్ ఇలా..

బాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పద్మావతి. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ విడుదల కాగా, రిలీజైన 24 గంటల్లోనే యూట్యూబ్‌లో రెండు కోట్ల 14 లక్షల మందికి పైగా వ్యూస్ లభించాయి. కేవలం యూట్యూబ్‌లోనే మూడు లక్షల 95 వేల లైక్‌లు వచ్చాయి. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ లో దీపిక టైటిల్ పాత్ర పోషించగా, రణ్వీర్ సింగ్ సుల్తాన్ అల్లాఉద్దీన్ ఖిల్జి పాత్రలో, షాహిద్ కపూర్ మహారావల్ రతన్ సింగ్ పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల రణ్ వీర్ లుక్ ని ప్రేక్షకుల ముందు తీసుకొచ్చింది పద్మావతి టీం. విచిత్ర వేష ధారణలో ఉన్న రణ్వీర్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక దీపిక లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా షాహిద్ కపూర్ తన ఇన్ స్ట్రాగ్రామ్ లో మహారావల్ రతన్ సింగ్ పాత్రకి సంబంధించిన లుక్ ని పోస్ట్ చేశాడు. ఇందులో షాహిద్ ఫిజిక్ ని చూసి కొందరు షాక్ కాగా, రణ్ వీర్ తో పోలుస్తూ ఎవరు బలవంతులు అనే పోలింగ్ పెడుతున్నారు. డిసెంబర్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Still waters run deep. He will rise on the 1st of December. Wait for it. #rajputpride

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

1273

More News

VIRAL NEWS