రోజుకు 20 సిగ‌రెట్స్ తాగిన స్టార్ హీరో

Fri,April 12, 2019 07:56 AM
Shahid Kapoor SAYS his experience about arjun reddy remake

సినిమాలోని పాత్ర‌ల కోసం ఒక్కోసారి మ‌న‌కు న‌చ్చ‌ని ప‌నులు కూడా త‌ప్ప‌క చేయాల్సి వ‌స్తుంది. సిగ‌రెట్ అంటే అస్స‌లు ప‌డ‌ని బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ క‌పూర్ త‌న తాజా చిత్రం క‌బీర్ సింగ్ కోసం రోజు 20 సిగ‌రెట్స్ తాగే వాడ‌ట‌. సినిమాలో ప్రేయ‌సి దూర‌మైన త‌ర్వాత ఆ బాధ‌లో మందు, సిగ‌రెట్స్‌కి బానిసైన పాత్ర‌లో క‌నిపిస్తాడు షాహిద్‌. ఆ పాత్ర కోసం సిగ‌రెట్స్ ఎక్కువ మొత్తంలో తాగాల్సి వ‌చ్చింద‌ని షాహిద్ అంటున్నారు. అయితే ఇంటికి వెళ్తే త‌న పిల్ల‌ల‌కి ఎక్కడ వాస‌న వ‌స్తుందో అని లొకేష‌న్‌లోనే 2 గంట‌ల పాటు ష‌వ‌ర్ చేసి వెళ్లేవాడ‌ట‌. తెలుగు అర్జున్ రెడ్డి చిత్రాన్ని నార్త్ ప్రేక్ష‌కుల‌కి త‌గ్గ‌ట్టుగా తీసామ‌ని అంటున్నారు షాహిద్‌. తెలుగు అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెర‌కెక్కించిన సందీప్ రెడ్డి వంగ హిందీ వ‌ర్షెన్‌ని తెర‌కెక్కిస్తున్నాడు. కియారీ అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. జూన్ 21న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

2513
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles