అర్జున్ రెడ్డి ఫ్యామిలీలోకి చిన్ని రాకుమారుడు ఎంట్రీ

Thu,September 6, 2018 09:56 AM
Shahid Kapoor, Mira Rajput welcome baby boy on wednesday

తెలుగులో సంచ‌ల‌న విజ‌యం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న హీరో షాహిద్ క‌పూర్. ప్ర‌స్తుతం ఈ హీరో సెప్టెంబ‌ర్ 21న విడుదల కానున్న బ‌ట్టీ గుల్ మీట‌ర్ చాలు చిత్ర ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉన్నాడు. అయితే నిన్న( బుధ‌వారం) సాయంత్రం షాహిద్ ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. షాహిద్ ఫ్యామిలీలోకి చిన్ని రాకుమారుడు ఎంట్రీ ఇచ్చాడు. బుధవారం సాయంత్రం ముంబైలోని హిందుజా ఆస్పత్రిలో మీరా రాజ్‌పుత్‌ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మీరా రాజ్‌పుత్‌ ప్రాణ స్నేహితురాలు ప్రగ్యా యాదవ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేశారు.

షాహిద్ కపూర్, మీర్జా రాజ్‌పుత్ దంపతులకు ఆగస్ట్ 26, 2016 సాయంత్రం 7:56 ని.లకు మిషా కపూర్ అనే పండంటి బిడ్డ తొలి సంతానంగా జన్మించిన సంగతి తెలిసిందే. ఆ చిన్నారి బ‌ర్త్‌డే వేడుక‌ల‌ని ఈ మ‌ధ్య విదేశాల‌లో గ్రాండ్‌గా జ‌రిపారు. వారికి రెండో సంతానంగా అబ్బాయి జ‌న్మించ‌డంతో ఫ్యామిలీ అంతా ఆనందంలో ఉంది. 2015లో షాహిద్‌, మీరాలు వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యారు . అలియా భ‌ట్‌తో పాటు ప‌లువురు సెల‌బ్రిటీలు షాహిద్ దంప‌తుల‌కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. షాహిద్ న‌టించ‌నున్న అర్జున్ రెడ్డి రీమేక్ చిత్రం వచ్చే ఏడాది జూన్‌ 21న విడుదల కానున్నట్లు సమాచారం.

7761
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS