క్యాన్స‌ర్ వార్త‌ల‌పై స్ప‌ష్ట‌త ఇచ్చిన స్టార్ హీరో

Mon,December 10, 2018 06:25 PM
shahid kapoor clarifies on cancer romours

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ క‌పూర్ కు క్యాన్స‌ర్ సోకిన‌ట్లు రెండుమూడు రోజులుగా వార్త‌లు చ‌క్క‌ర్లు విష‌యం తెలిసిందే. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ లో న‌టిస్తున్న షాహిద్.. షూటింగ్ కు సుదీర్ఘ విరామం తీసుకోవ‌డంతో..అత‌నికి ఉద‌ర క్యాన్స‌ర్ వ‌చ్చిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌ల‌పై అత‌ని అభిమానుల‌ను ఆందోళ‌న‌కు గురి చేశాయి. ఈ వార్త‌ల‌పై త‌న అభిమానుల‌కు ట్విట్ట‌ర్ ద్వారా స్ప‌ష్ట‌త ఇచ్చాడు షాహిద్. నేను పూర్తి ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నా. అవాస్త‌వ విష‌యాల‌ను న‌మ్మ‌కండ‌ని స్ప‌ష్ట‌త ఇచ్చాడు. క‌బీర్ సింగ్ షూటింగ్ నుంచి విరామం తీసుకున్న షాహిద్ క‌పూర్ ప్ర‌స్తుతం ఢిల్లీలో త‌న కుటుంబంతో క‌లిసి ఎంజాయ్ చేస్తున్నాడు. కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల త‌ర్వాత ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన‌నున్నాడు షాహిద్.
4615
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles