'ప‌ద్మావ‌తి'కి డ‌బ్బింగ్ మొద‌లు పెట్టిన షాహిద్ క‌పూర్

Wed,September 13, 2017 05:22 PM
Shahid Kapoor Begins His Dubbing

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే న‌టుల‌లో బాలీవుడ్ హీరో షాహిద్ క‌పూర్ ఒక‌డు. త‌న డైలీ యాక్టివిటీస్‌కి సంబంధించిన విష‌యాల‌ను ఎప్పటిక‌ప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో షేర్ చేసుకుంటూ ఉంటాడు. ఇటీవ‌ల త‌న కూతురు, భార్య బ‌ర్త్‌డే వేడుక‌ల‌ని సంబంధించిన ఫోటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన షాహిద్ తాజాగా త‌న సెల్ఫీని పోస్ట్ చేస్తూ ప‌ద్మావ‌తి మూవీకి డ‌బ్బింగ్ మొద‌లుపెడుతున్న‌ట్టు తెలియ‌జేశాడు. సెల్ఫీలో షాహిద్ వైట్ టీ ష‌ర్ట్ ధ‌రించి కోర‌మీసాలు, డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్‌తో క‌నిపిస్తున్నాడు. ప‌ద్మావ‌తి చిత్రంలో షాహిద్ కపూర్ రావ‌ల్ ర‌త‌న్ సింగ్ అనే పాత్ర‌ని పోషించ‌గా, ర‌ణ‌వీర్ సింగ్ అల్లాఉద్దీన్ ఖిల్జీ పాత్ర‌లో మ‌రియు దీపిక ప‌దుకొణే చిత్తూరు యువ‌రాణి, రాణి ప‌ద్మావ‌తి పాత్ర‌లో క‌నిపించ‌నుంది. పీరియాడిక‌ల్ డ్రామాగ తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. 2018 ఫిబ్ర‌వ‌రిలో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Time to dub. #padmavati 🔥

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on


785
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS