వైరలయిన షాహిద్, మీరా ఫోటో.. నెత్తి పీక్కుంటున్న నెటిజన్లు

Sat,June 23, 2018 02:02 PM
Shahid Kapoor and Mira Rajput adorable new pic confusing netizens

బాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో షాహిద్, మీరా రాజ్‌పుట్ ఒకరు. వాళ్ల పెండ్లి దగ్గర్నుంచి వాళ్ల లైఫ్‌లో జరిగే ప్రతి మూమెంట్‌ను క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. వాళ్ల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా తమ అభిమానులతో సోషల్ మీడియలో పంచుకుంటారు. దీంతో వాళ్లకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది.

రీసెంట్‌గా వీళ్లిద్దరు కలిసి దిగిన ఓ ఫోటోను షాహిద్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశాడు. అయితే.. ఆ ఫోటో కొంచెం కన్ఫ్యూజింగ్‌గా ఉంటుంది. ఆ ఫోటోలో షాహిద్, మీరా ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకొని ఉంటారు. అయితే.. ఎవరు ఎవరిని కౌగిలించుకున్నారనే విషయంలోనే నెటిజన్లు నెత్తి గోక్కుంటున్నారు. దీంతో తమ మెదడుకు పదును పెట్టి మరీ.. ఎవరు ఎవరిని కౌగిలించుకున్నారో క్లారిటీ ఇస్తున్నారు. ఇంతకీ.. ఈ ఫోటో చూసిన తర్వాత మీకైనా క్లారిటీ వచ్చిందా?

❤️

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

4909
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles