అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్ త‌దుపరి చిత్రంపై క్లారిటీ

Thu,April 26, 2018 10:10 AM
Shahid kapoor acts in  Arjun Reddy of hindi remake

సైలెంట్‌గా వ‌చ్చి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రం అర్జున్ రెడ్డి. భారీ ఆర్భాటాలు, ఎలాంటి ప్ర‌మోష‌న్స్ లేకుండా కేవ‌లం వివాదాల న‌డుమ విడుద‌లై భారీ విజ‌యం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గర ప్ర‌భంజ‌నం సృష్టించింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, షాలిని పాండే ఇందులో ప్ర‌ధాన పాత్రలు పోషించారు. సందీప్ రెడ్డి వంగా ద‌ర్శక‌త్వంలో రూపొందిన ఈ చిత్రం త‌మిళంలో రీమేక్ అవుతుంది. వ‌ర్మ అనే టైటిల్‌తో విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ హీరోగా చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు త‌మిళ ద‌ర్శ‌కుడు బాల‌. ఇక హిందీలోను ఈ సినిమా రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ పాత్ర‌కి హిందీలో ప‌లు స్టార్స్‌ని ప‌రిశీలించిన యూనిట్ చివ‌రికి షాహిద్ క‌పూర్‌ని ఓకే చేసింద‌ట‌. త్వ‌ర‌లోనే ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంద‌ని స‌మాచారం. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో తెర‌కెక్కించిన సందీప్ రెడ్డి హిందీలోను తెర‌కెక్కించ‌నున్నాడ‌ట‌. తొలి సినిమాతోనే సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డికి రెండో సినిమాగా బాలీవుడ్ చిత్రం రావ‌డం అదృష్ట‌మ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. మ‌హేష్ బాబుతోను సందీప్ రెడ్డి ఓ సినిమా తీయాల్సి ఉండ‌గా అది అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ త‌ర్వాతే ఉంటుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

2064
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS