స‌ల్మాన్ సినిమాలో షారూఖ్‌.. ఇది నిజం!

Sun,June 18, 2017 10:31 AM
Shah rukh  played cameo role in tubelight

బాలీవుడ్ ఖాన్ త్ర‌యంలో షారూఖ్ ఖాన్, స‌ల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ఉన్నారు. ఇప్ప‌టికి బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో వీరే టాప్ హీరోలుగా ఓ వెలుగు వెలుగుతున్నారు. ఈ మ‌ధ్య ముగ్గురు హీరోలు ఒక‌రి సినిమాల‌కి ఒక‌రు ప్ర‌మోష‌న్ చేసుకోవ‌డ‌మే కాదు, ఒక‌రి సినిమాలో ఒక‌రు న‌టించేందుకు కూడా ఆస‌క్తి చూపుతున్నారు. తాజాగా స‌ల్మాన్ న‌టించిన ట్యూబ్ లైట్ చిత్రంలో షారూఖ్ ఖాన్ ఓ ప్ర‌ధాన పాత్ర చేసాడ‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. ట్రైల‌ర్ లో షారూఖ్ ఖాన్ సిగ్నేచర్ పోజ్ ఒక‌టుంద‌ని , రూమ‌ర్స్ కి ఇదే ఆన్స‌ర్ అని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై స‌ల్మాన్ సోద‌రుడు సోహైల్ క్లారిటీ ఇచ్చాడు. ట్యూబ్ లైట్ చిత్రంలో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కీలకమైన పాత్రలో కనిపిస్తున్నాడు. కథను మలుపు తిప్పే ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో షారూఖ్ కనిపించబోతున్నట్టుగా వెల్లడించాడు సోహైల్. అంతేకాదు ఆ పాత్రకు షారూఖ్ ఇమేజ్ చాలా హెల్ప్ అవుతుందని అందుకే షారూఖ్ మాత్ర‌మే ఆ పాత్ర చేయాల‌ని ఒప్పించిన‌ట్టు సోహైల్ తెలిపాడు. ఇక ఈ చిత్రంలోని స‌ల్మాన్ క్యారెక్ట‌ర్ మ‌రో సారి భ‌జరంగీ బాయిజాన్ చిత్రంలోని పాత్ర‌ని గుర్తు చేస్తుండ‌గా, అమాయ‌కుడిగా త‌న న‌ట విశ్వ‌రూపాన్ని చూపించాడు స‌ల్మాన్. జూజూ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ట్యూబ్ లైట్ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ తల్లి సల్మా ఖాన్ నిర్మిస్తుండ‌గా, ఇందులో స‌ల్మాన్ సోద‌రుడు సోహైల్ సైనికుడిగా కనిపించనున్నాడు.

929
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS