జీరో ట్రైలర్: మరుగుజ్జుగా షారుఖ్, దివ్యాంగురాలిగా అనుష్క అదరగొట్టారు

Fri,November 2, 2018 05:13 PM
Shah Rukh Khan Zero Official Trailer

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, క్రేజీ డైరెక్టర్ ఆనంద్ ఎల్. రాయ్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం జీరో. 2018 డిసెంబర్ 21న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. ప్రయోగాత్మక చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో అనుష్క‌ శర్మ, కత్రినా కైఫ్ కథానాయికలుగా నటించ‌గా, షారుఖ్ మరుగుజ్జుగా కనిపించనున్నాడు. అయితే ఈ చిత్రంలో సూపర్ స్టార్ పాత్ర పోషిస్తున్నారు కత్రినా. ఆమె ప్రేమను గెలుచుకోవాలని షారుఖ్ ప్రయత్నిస్తుంటారు. మరోపక్క అనుష్క మానసిక దివ్యాంగురాలి పాత్రలో క‌నిపించనున్నారు. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మూవీపై ఆస‌క్తి క‌లిపించేందుకు చిత్ర యూనిట్ వినూత్నంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు చేప‌డుతుంది.

ఇవాళ షారుఖ్ బర్త్‌డే సందర్భంగా బర్త్‌డే బాయ్ సినిమా ట్రైలర్‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. సినిమాలో ఎవరి నటన ఎలా ఉంటుందో చెప్పలేం కానీ.. ట్రైలర్‌లో మాత్రం షారుఖ్, అనుష్కా శర్మ తమ నటనతో వారెవ్వా అనిపించారు. ఇక.. కత్రినా తన అందాలతో మెరిసింది.

2032
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles