మ్యూజిక్ వీడియోతో నివాళి అర్పించిన షారూఖ్‌

Fri,August 17, 2018 10:13 AM
Shah Rukh Khan Tribute For Atal Bihari Vajpayee

భారత రాజకీయాల్లో ఒక గొప్ప ప్రజాస్వామ్యవాది అటల్ బిహారీ వాజ్ పేయి నిన్న సాయంత్రం త‌నువు చాలించిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని ప్ర‌తి ఒక్క‌రు ప్రార్ధిస్తున్నారు. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌కి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు కూడా ఆయ‌న‌తో ఉన్న అనుబంధాన్ని సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ ఆయ‌న రాసిన ప‌ద్యంతో కూడిన వీడియోని షేర్ చేస్తూ నివాళులు అర్పించాడు. క్యా కోయా క్యా ప‌యా జ‌గ్ మేన్ అనే ప‌ద్యాన్ని కొన్నేళ్ళ క్రితం అట‌ల్ బిహారీ వాజ్ పేయి రాసారు. ఈ క‌విత‌ను స్వ‌ర్గీయ జ‌గ్జీత్ సింగ్ ఆల‌పించారు. 1999లో షారూఖ్ ఖాన్ మీద చిత్రీక‌రించిన ఈ పాట ఇప్ప‌టికి కూడా అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది. జీవితంలో మ‌నిషి ఎదుర్కొనే ఆటుపోట్ల‌ను వాజ్‌పేయి ఈ క‌విత‌లో రాశారు. ఈ పద్యాన్ని త‌మ సినిమాలో వాడుకున్నారు య‌శ్ చోప్రా. వీడియోని షారూఖ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేస్తూ .. త‌న‌కి వాజ్‌పేయితో ఉన్న అనుబంధం గుర్తు చేసుకున్నారు.నేను వాజ్‌పేయి స్పీచ్ వింటూ ఎదిగాను. అప్ప‌ట్లో ఢిల్లీలో జ‌రిగే ప్ర‌తి స‌భకి మా నాన్న‌గారు తీసుకెళ్లేవారు. సంవ‌త్స‌రాలు గడిచిన త‌ర్వాత ఆయ‌న‌తో క‌లిసి క‌థ‌లు, సినిమాలు, రాజ‌కీయాలపై చర్చించే అవకాశం వ‌చ్చింది. మా ఇంట్లో అంద‌రం ఆయ‌న‌ని బాప్జీ అని పిలుచుకుంటాం. ఆయ‌న మ‌ర‌ణం దేశానికి తీర‌ని లోటు. వ్య‌క్తిగ‌తంగా వాజ్‌పేయి మ‌ర‌ణం నా మీద ఎంతో ప్ర‌భావం చూపుతుంది. ఆయ‌న ప‌ద్యాల‌ని ఎంత‌గానో మిస్ అవుతున్నాను. ఆయ‌న ఆత్మకి శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను. వారి కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను అని ట్వీట్ చేశారు. దేశాభివృద్ది కోసం ఎంతో త‌పించిన అట‌ల్ బిహారీ వాజ్‌పేయి ఎంత‌గానో సాహితీ మ‌ధ‌నం చేశారు. ఆయ‌న మృతికి సినీ ప‌రిశ్ర‌మ‌కి చెందిన ర‌జ‌నీకాంత్‌, ప్రియాంక చోప్రా, క‌మ‌ల్ హాస‌న్, మోహ‌న్ బాబు, చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ , విశాల్‌, కొర‌టాల శివ‌, ధ‌నుష్ త‌దిత‌రులు నివాళులు అర్పించారు.
1183
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles