ట్విట్ట‌ర్ సీఈఓ తో షారూఖ్ మెడిటేష‌న్

Thu,November 15, 2018 10:03 AM
Shah Rukh Khan meditation With Twitter CEO

ట్విట్ట‌ర్ సీఈఓ జాక్ డోర్సీ ప్ర‌స్తుతం ఇండియా టూర్‌లో బిజీగా ఉన్నారు. టూర్‌లో బాగంగా నిన్న ముంబై వెళ్లిన జాక్ షారూఖ్ మ‌న్న‌త్‌( షారూఖ్ నివాసం)కి వెళ్ళారు . అక్క‌డ ఇద్ద‌రు క‌లిసి ధ్యానం చేస్తున్న‌ట్టు ఫోటోకి ఫోజులిచ్చారు. ఈ ఫోటోని షారూఖ్ త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. ఒక ఉల్లాస‌మైన సాయంత్రాన్ని భార‌త‌దేశంలో సంతోషంగా గ‌డ‌పండి. జాక్ ప్ర‌శాంత‌మైన వైఖ‌రి, ఆయ‌న ఆలోచ‌న‌లు నాకు తెలుసు. ధ్యానం లేక‌పోతే జాక్ నిరుత్సాహ‌ర‌పుడైన బాలుడిగా మార‌తాడు అని షారూఖ్ త‌న ట్విట్‌లో తెలిపాడు. మ‌న్న‌త్‌లో షారూఖ్‌, జాక్‌లు స‌ర‌దా స‌మ‌యాన్ని గ‌డ‌ప‌డంతో పాటు ప‌లు విష‌యాల‌పై చ‌ర్చలు జ‌రిపిన‌ట్టు తెలుస్తుంది. షారూఖ్ ఖాన్ ప్ర‌స్తుతం జీరోతో బీజీగా ఉన్నాడు. ఈ సినిమా అతి త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, చిత్రానికి సంబందించి విడుద‌లైన వీడియోలు, పోస్ట‌ర్స్ ప్రేక్ష‌కుల‌లో సినిమాపై మ‌రింత ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి.

989
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles