నా హృద‌యం ఖాళీ లేదు: షారూఖ్ ఖాన్‌

Fri,June 8, 2018 09:08 AM

సామాజిక మాధ్య‌మాలు అభిమానులు, సెల‌బ్రిటీల‌ను ఎంత ద‌గ్గ‌ర‌గా చేసాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సోష‌ల్ నెట్‌వ‌ర్క్స్‌లో అభిమానుల అడిగిన ప్ర‌శ్న‌ల‌కి ఎంతో ఓపిక‌గా స‌మాధానం చెబుతూ వారి అనుమాల‌ని నివృత్తి చేస్తున్నారు నేటి స్టార్స్‌. తాజాగా బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ త‌న అభిమానుల‌తో ముచ్చ‌టించ‌మే కాదు , వారు అడిగిన ప్ర‌శ్న‌ల‌కి చిలిపి స‌మాధానాలు కూడా ఇచ్చాడు.

షారూఖ్ ఇటీవల జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. నాకు ఆకాంక్ష అనే పేరు ఎంతో ఇష్టం. మ‌రోసారి నేను తండ్రి అయితే నాకు పుట్టే బిడ్డకు ఆ పేరే పెడ‌తానంటూ వ్యాఖ్యానించారు. దీనిపై ఓ అభిమాని ట్విట్ట‌ర్‌లో .. ఓ మై గాడ్ .. ఓ మై గాడ్ మీరు నాలుగోసారి తండ్రి కాబోతుండ‌డం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అనుకున్న‌ది జ‌రుగుతుంది అని కామెంట్ పెట్టాడు. నెటిజ‌న్ ట్వీట్‌కి బ‌దులు ఇచ్చిన షారూఖ్‌.. ‘ఓ మై గాడ్.. ఓ మై గాడ్! మీరు అనుకున్నది జరిగే లోపు నేను అబ్ రామ్ దుస్తులను దాచి పెట్టాలి. భవిష్యత్తులో పనికొస్తాయి కదా. అయిన ఇప్ప‌టికే నా హృద‌యం అందమైన ముగ్గురు పిల్లలు, ప్రియమైన భార్య, ఓ సోదరితో హృదయమంతా నిండిపోయింది. ఇక ఖాళీలేదు’ అని షారూక్ చెప్పాడు. షారుఖ్‌- గౌరీ ఖాన్‌ దంపతులకు ఆర్యన్‌, సుహాన, అబ్‌రాం అనే ముగ్గురు పిల్లలున్న సంగతి తెలిసిందే.
2154
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles