జీరో సెట్స్‌లో అనుష్క‌, షారూఖ్

Fri,January 12, 2018 12:26 PM
shah rukh, anushka on the sets of zero

కింగ్ ఖాన్ షారూఖ్, క్రేజీ డైరెక్టర్ ఆనంద్ ఎల్. రాయ్ కాంబినేషన్లో తెర‌కెక్కుతున్న చిత్రం జీరో . రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో షారూఖ్ మరుగుజ్జుగా కనిపించనున్నాడు. 2018 డిసెంబర్ 21న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. గౌరీ ఖాన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో షారూఖ్ సరసన అనుష్మ శర్మ, కత్రినా కైఫ్ కథానాయికలుగా నటిస్తున్నారు. 2012లో వచ్చిన జబ్ తక్ హై జాన్ చిత్రంలో అలరించగా, ఇప్పుడు జీరో కోసం మరోసారి జతకట్టారు. ఇందులో అనుష్క మానసిక స్థితి సరిగా లేని యువతిగా నటిస్తున్నట్లు సమాచారం. అయితే రీసెంట్‌గా టీంతో క‌లిసిన అనుష్కకి `రంగుల పూలతో స్వాగతం చెప్పారు చిత్ర బృందం. అంతేకాదు అనుష్క కార్ వ్యాన్ ని పూల కుండీలు, కొత్త జంట ఫోటోలతో అందంగా అలంకరించారు. ఈ విష‌యాన్ని అనుష్క త‌న ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా తెలియ‌జేసింది. ఇక తాజాగా జీరో సెట్స్‌లో కారు నుండి దిగుతున్న అనుష్క‌, షారూఖ్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.


1362
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS