సినిమా ఫ‌క్కీలో మ‌ర్డ‌ర్ ప్లాన్ చేసిన సినీ న‌టుడు

Fri,June 14, 2019 08:40 AM
shabarish plan a murder to his wife

సినీ ఫ‌క్కీలో క‌న్న‌డ న‌టుడు శ‌బ‌రీష్ త‌న భార్యని హ‌త్య చేసేందుకు కుట్ర పన్నాడు. స‌కాలంలో పోలీసులు స్పందించ‌డంతో ఆ న‌టుడి ప్లాన్ ఫ్లాప్ కాగా, ప్ర‌స్తుతం క‌ట‌క‌టాలు లెక్క‌పెడుతున్నాడు. వివ‌రాల‌లోకి వెళితే బెంగ‌ళూరుకి చెందిన క‌న్న‌డ న‌టుడు శ‌బ‌రీష్‌కి గ‌తంలోనే వివాహం అయింది. అయితే త‌న‌కి స్టార్ హీరోలు, పెద్ద నిర్మాత‌లు తెలుసని నీకు హీరోయిన్ ఛాన్స్ ఇప్పిస్తాన‌ని ప‌ద్మ‌శ్రీ అనే యువ‌తికి మాయ‌మాట‌లు చెప్పి మ‌రోసారి వివాహం చేసుకున్నాడు. కేఆర్ పురం శివార్ల‌లోని భ‌ట్ట‌ర హ‌ళ్ళిలో కాపురం కూడా పెట్టాడు. కొన్నాళ్ళకి మ‌నోడి అస‌లు రంగు ప‌ద్మ‌శ్రీకి తెలియ‌డంతో ఆమెని హ‌త్య చేయాల‌ని స్కెచ్ వేశాడు. ముందుగా ఆమెకి మ‌త్తు మందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశాడు. త‌న స్నేహితులు ఐదుగురిని పిలిపించుకొని హ‌త్య చేయాల‌ని అనుకుంటున్న స‌మ‌యంలో పద్మ‌శ్రీ స్నేహితుడు పోలీసుల‌ని తీసుకొని సంఘ‌ట‌నా స్థలానికి చేరుకున్నాడు. విష‌యం తెలుసుకున్న పోలీసులు నిర్ఘాంత‌పోయారు. శ‌బ‌రీష్‌తో పాటు మ‌రొక వ్య‌క్తిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేష‌న్‌కి త‌ర‌లించారు. న‌లుగురు ప‌రారీలో ఉన్న‌ట్టు తెలుస్తుంది.

7182
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles